ఇండ్ల కోసం ఎన్నాళ్లు తిప్పుకుంటారు..?

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లకిë
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి.. ఇంకెన్నాళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë ప్రభుత్వాన్ని ప్రశ్నింఆచరు. సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని బండ్లగూడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రిలేదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు రెండు పడకల గది కట్టిస్తామని కేసీఆర్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రలోభాలకు గురి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు ఇండ్లు ఇవ్వకుండా మహిళలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ పట్టణంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని ఇప్పటివరకు వేలల్లో మాత్రమే పరిమితం అయ్యాయని, అవి కూడా పంపిణీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
దరఖాస్తుల పరిశీలనకు సర్వేలు చేస్తున్నా.. అవి ఏ ప్రాతిపదికన చేస్తున్నారో అర్థం కాకుండా ఉందన్నారు. పాతబస్తీలో ఎక్కువ శాతం పేద ప్రజలు నివసిస్తున్నారన్నారు. అనేక సార్లు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను కలెక్టర్‌, అర్డీఓ, ఎంఆర్‌ఓకు అందజేశారని చెప్పారు. ఆన్‌లైన్‌లో చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బండ్లగూడ మండలంలో దాదాపు 1800 ఇండ్లు ఇప్పటివరకు పూర్తి కాగా, స్థానికులను ఎలాంటి పత్రాలూ అందించకపోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే వరకు తెచ్చుకోవద్దన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వెంటనే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సక్రమంగా సర్వే చేసి అర్హులైన పేద ప్రజలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల ప్రజలను పెద్దఎత్తున కదిలించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు హెల్‌ కోటిరెడ్డి, లక్ష్మమ్మ, సత్తార్‌, కృష్ణా నాయక్‌, బాబర్‌ ఖాన్‌, శశికళ, కిషన్‌, రామ్‌ కుమార్‌, శ్రీను, రాజేష్‌, నూర్జహాన్‌, ఫిర్దోస్‌, జావిదా బేగం, భాను బేగం, లక్ష్మి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love