జూన్‌ 4న టీజేఎస్‌ మూడో ప్లీనరీ

పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మూడో ప్లీనరీ పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
జూన్‌ 4వ తేదీన తెలంగాణ జన సమితి మూడో ప్లీనరీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్లీనరీ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ జరుగుపుకొలేకపోయమన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షల కోసం పోరాటం నిర్వహించాలన్నారు. పార్టీ ప్రజల ఆకాంక్షల కోసం కృష్ణ జలాల కోసం పోరాటం చేశాం అన్నారు. ఢిల్లీలో కూడా మౌన దీక్ష నిర్వహించి మంత్రులకు వినతి పత్రాలు అందజేశాం తెలిపారు. పేపర్‌ లీకేజీ వ్యవహారం మీద పోరాటం చేశాం అని తెలిపారు. రాబోయేది ఎన్నికల ఏడాది అనీ, భవిష్యత్‌ కార్యాచరణ మీద దృష్టి పెడతామన్నారు. రైతు రాజ్యం కావాలి అని చెప్పటం దైయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. రైతులకు రుణ మాఫీ చేయాలన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వెంట నే చెల్లించాలన్నారు. నేటి పాలకులు నుంచి తెలంగాణను కాపా డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ చట్టం ఉద్యోగులను కూడా సంఘటితం చేస్తాం అని చెప్పారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు అందరం కోట్లాది తెలంగా ణ సాధిస్తే. కేసిఆర్‌ తన కుటుంబం బాగు కోసం, ఆస్తులు కూడబెట్టుకోడం కోసం చూస్తున్నా రన్నారు. పోరాటం కోసం అనుస రించాల్సిన వ్యూహాల మీద దృష్టి పెడుతాం అన్నారు. తెలంగాణ జన సమితి మూడో ప్లీనరీకి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేష్‌, ఆశ అప్పారావు, రైతు విభాగం భీమన్న శ్రీధర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు నరసయ్య, విద్యార్థి విభాగం అరుణ్‌, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love