ఇఫ్లూలో లైంగిక వేధింపుల నిందితులను శిక్షించాలి

Those accused of sexual harassment should be punished in IFL– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. బాధితురాలికి అండగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సుభాశ్‌నగర్‌లో శనివారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్‌ మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఇఫ్లూ యూనివర్సిటీలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదని, సరైన వీధిలైట్లు కూడా లేని దుస్థితి ఉన్నారు. అక్కడి అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దుండగులను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు విశాల్‌ నగర ఉపాధ్యక్షులు దీపిక, నాయకులు గంగ ప్రసాద్‌, రాహుల్‌, కార్తీక్‌, ఆజాద్‌, దుర్గా, శైలజ, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్లూ విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ సంఘీభావం
హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ యూనివర్శిటీ (ఇఫ్లూ) విద్యార్థులకు లింగ న్యాయం, హింస లేని క్యాంపస్‌ కోసం ధైర్యంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శి విపి సాను, మయుక్‌ బిశ్వాస్‌లు ప్రకటన చేశారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్క రించడానికి విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్‌ వైపు నిర సన పై దాడిని ఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. ”అక్టోబరు 18 రాత్రి హైదరాబాద్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌ లో ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు జరిగాయి. ఈ భయంకరమైన సంఘటన క్యాంపస్‌ లో లింగ సమానత్వ వాతా వరణం లేకపోవడాన్ని మరోసారి బహిర్గతం చేసింది” అని తెలిపింది. ”నేరస్తులపై కేసు నమోదు చేయాలి. ప్రాణాలతో బయటపడిన వారికి, విద్యార్థి సంఘానికి న్యాయం జరిగేలా చూడడానికి బదులు, ఈ సంఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జెండర్‌ సెన్సిటే షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని స్వరం వినిపించిన విద్యార్థులపై యూని వర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ నీచమైన ప్రతీకార చర్యకు పాల్పడింది. నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలి. సంస్థా గత విధులను నిర్వర్తించడం లో పూర్తిగా విఫలమైన, నేరస్థులతో జతకట్టిన ఇఫ్లూ వైస్‌ చాన్సలర్‌, అడ్మినిస్ట్రేషన్‌కు అనుగుణంగా వ్యవహరించ వద్దని మేము పోలీసులను డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే వీసీ, ప్రొక్టర్‌లు ఎలాంటి జాప్యం లేకుండా పదవు లకు రాజీనామా చేయాలనే విద్యార్థు ల డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కు లకు భంగం కలిగించే విధంగా హింసను ఎంచుకునే వారిపై చర్యలు తీసుకోవాలి” అని పేర్కొంది.

Spread the love