అగ్ని ప్రమాదంపై బాధ్యులను సస్పెండ్ చేయాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్
నవతెలంగాణ- సిరిసిల్ల: సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం కార్యాలయంలో  జరిగినటువంటి అగ్ని ప్రమాదం వలన సెస్ కార్యాలయంకు సంబంధించినటువంటి ముఖ్యమైన అన్ని రికార్డ్స్ ఉన్న గదిలో అగ్ని ప్రమాదం జరగడం వలన ఎంతో విలువైనటువంటి రికార్డులు దగ్ధమయ్యాయని అగ్ని ప్రమాదానికి బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని జిల్లా కార్యదర్శి  రమేష్ అన్నారు పార్టీ కార్యాలయంలో  సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రజలకు సంబంధించిన సమాచారం అన్ని ఖాళీ బూడిద అయిపోయినాయని దీపావళి పండుగ రోజు పటాకాలు పేల్చడం వలనే ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని చైర్మన్, అధికారులు తెలియచేస్తున్నారు కానీ ముఖ్యమైన వారు ఎండి  చైర్మన్  లేకుండానే పూజలు చేసి పటాకులు పేల్చే అధికారం సిబ్బంది రాజేందర్ కు ఎవరు ఇచ్చారని ఈ విషయంపై విచారణ చేపట్టాలన్నారు ఇటీవల  సెస్ లో చైర్మన్ బదిలీలు చేసిన సమయంలో కొన్నేళ్ల నుంచి కీలక పోస్టులో ఉన్న రాజేందర్ అనే ఉద్యోగిని కార్యాలయంలోనే మరోచోటికి బదిలీ చేశారు. ఆ కీలక పోస్టులో మాత్రం ఎవరిని భర్తీ చేయకుండా కొద్ది రోజుల తర్వాత ఆ కీలక పోస్టులు మళ్ళీ రాజేందర్ కే ఇన్చార్జి అప్పజెప్పడంలో చైర్మన్కు ఆయనపై ప్రేమ ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుందని పేర్కొన్నారు ఇప్పటికే అనేక కుంభకోణాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని కోర్టులో కేసులు నడుస్తున్నాయని  ఈ విషయంపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నందున వెంటనే మంత్రి కేటీఆర్  పోలీస్ లతో సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కోడం రమణ, నాయకులు ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, సబ్బం చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love