కాలువకు గండి పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

– సప్పిడి ఆదిరెడ్డి.. పీఏసీఎస్ డైరెక్టర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
దొంగతనంగా రాత్రి సమయంలో రంగాపురం కాలువకు గండి పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పీఏసీఎస్ డైరెక్టర్ సప్పిడి ఆదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోట కాలువ రైతులు కాలువకు గండిపడిన ప్రదేశాన్ని గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ అక్రమ సాగుదారులు ఈ దారుణానికి ఒడిగడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముందు ముందు ఒక్క ఎకరం పొలం ఎండిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఒక్కొక్క ఎగరానికి సుమారు 30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పొలాలు నీరంధక బీటలు వారు తుంటే గుండె తరుక్కుపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. సాగునీటి కోసం రేపటి నుండి ఆందోళన కార్యక్రమాలు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు ప్రారంభం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. గండి పెట్టిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. పసర పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ లు కూడా కాలువ గండిని పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love