తోట్ల మల్సూర్ జీవిత చరిత్ర పుస్తకం, విగ్రహం ఆవిష్కరణ..

– తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం నిర్మాణ తొలి అధ్యక్షులు తొట్ల మల్సూరు  జీవిత చరిత్ర పుస్తకం, విగ్రహా ఆవిష్కరణ జూన్  23 న జరిగే భారీ సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు మంగళవారం మండల కేంద్రంలోని తొట్ల మల్సూర్ స్మారక భవనంలో ఆ సంఘ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మల్సూర్ మండల పరిధి లో చిల్పకుంట్ల గ్రామంలో 1924 వ సంవత్సరంలో మల్లయ్య కనకమ్మల తొలి సంతానం నిరుపేద గీతా కార్మికుల కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే పాలేరు కొనసాగుతున్న రోజులలో భూస్వాముల పెత్తందారీ విధానం కింద గ్రామాల్లో నలుగుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఏర్పడిన గుత్ప సంఘంలో సభ్యుడిగా తన 17వ ఏట ఉద్యమంలో చేరారు.సూర్యాపేట ప్రాంత కమ్యూనిస్టు ఆర్గనైజర్లు మద్దికాయల ఓంకార్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ల శిక్షణలో కమ్యూనిస్టు  గెరిల్లాగా మారి దళ సభ్యుడిగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో   నిజం నిరంకుశ పాలనకు  భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి రద్దు దున్నేవానికి భూమి నినోదంతో పాటు గీసే వారికి చెట్టు నినాదం తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటు గీత కార్మికులు ఐక్యమేచేసి ఆ హక్కును సాధించి పెట్టిన గత ఘనత తనకి దక్కిందని వారన్నారు,జిల్లా ప్రధానకార్యదర్శి మడ్డి అంజిబాబు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా నల్లగొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలోని గీత కార్మికులు సంఘటిత ఐక్యంగా చేసిన త్యాగ పోరాటం స్ఫూర్తితోఈనాటి వరకు ఎక్స్గ్రేషియా. పెన్షన్ సాధించుకో గలుగుతున్నాం అన్నారు. ఆయన సింగిల్ విండో చైర్మన్ గా రెండు పర్యాలుగా నూతనకల్ తొలి జెడ్పిటిసి గా ఎన్నో పదవులు పొందినారు. వారి సతీమణి తొట్ల మల్లమ్మ  కల్లుగీత కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘంలో పని చేసినారు. వారి ఆసాయా సాధన కోసం సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని బిక్షం తుమ్మల సైదయ్య గుణగంటి కృష్ణ బోడపట్ల జయమ్మ జిల్లా సహాయ కార్యదర్శి ఉయ్యాల నగేష్ బత్తుల జనార్ధన్ జిల్లా కమిటీ సభ్యులు బట్టిపల్లి నాగమల్లయ్య తోట్ల ప్రభాకర్ బెల్లంకొండ ఇస్తారు మండవ సైదులు బొల్లెపల్లి శ్రీనివాస్ ఆకుల రమేష్ గుణగంటి వెంకన్న నకిరేకంటి శ్రీను గుడిపూడి శ్రీనివాస్  రైతు సంఘం జిల్లా నాయకులు కందాల శంకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Spread the love