ఒడిశా రైలు దుర్ఘటనలో ముగ్గురి అరెస్టు

– రైల్వే సిబ్బంది సాక్ష్యాలను నాశనం చేశారు:సీబీఐ
భువనేశ్వర్‌:   ఒడిశా రైలు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేపడుతోన్న సీబీఐ రైల్వేశాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగల్‌) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లు ఉన్నారు. సాక్ష్యాలను నాశనం చేయడం తదితర అభియోగాలను వారిపై మోపింది. ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలోని బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద గత నెలలో మూడు రైళ్లు ఢకొీన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 293 మంది మృతి చెందగా.. 1000మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి రాంగ్‌ సిగలింగే కారణమని ఇటీవల ‘రైల్వే భద్రత కమిషనర్‌’ దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది.

Spread the love