Thursday, May 21, 2026
E-PAPER
Homeక్రైమ్కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

- Advertisement -

జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం..
నవతెలంగాణ – మేడిపల్లి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండపూర్‌ గ్రామంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. అప్పటి వరకు ఆలయంలో పూజా కార్యక్రమంతో సంతోషంగా గడిపిన కుటుంబం.. చివరకు ముగ్గురు చిన్నారుల మృతితో కన్నీటి సంద్రంలో మునిగి పోయింది. ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు ఆలయ కోనేరు లో పడి ప్రాణం కోల్పోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కొండాపూర్‌ గ్రామ శివారులోని శివగంగ కోనేరు వద్ద బుధవారం మధ్యాహ్నం వడ్లగట్ల శేఖర్‌ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తెప్ప తీసే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. భోజనాలు చేసే సమయంలో తన కుమారుడు శర్విందు శివ(7), జగిత్యాలకు చెందిన దేవనపల్లి నాగభూషణం కొడుకు మన్విత్‌ సాయి(12), కూతురు మనస్విని(10) కనిపించలేదు. శివగంగ కోనేరు వద్దకు వెళ్లి చూడగా ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి విగత జీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -