– సీనియర్ నేతల్ని నియమించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ఎన్నికలకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆ పార్టీ సీనియర్ నేతలు అజరు మాకేన్, ప్రతాప్‌సింగ్ బజ్వాలను ఎఐసిసి సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాల్లో 89 కాంగ్రెస్, ఒక్క స్థానానికి సీపీఐ(ఎం) పోటీ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆప్ పార్టీతో చర్చలు జరిగింది. సీట్లు సర్దుబాటు చేసుకుని ఉమ్మడిగా పోటీ చేయాలనుకున్నా.. ఈ రెండు పార్టీల మధ్య చర్చలు విఫలమై.. సీట్ల ఒప్పందం కుదరలేదు. దీంతో కాంగ్రెస్.. మిత్రపక్ష పార్టీ సీపీఐ(ఎం)లే కలిసి పోటీ చేస్తున్నాయి.
కాగా, హర్యానాలో గత పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు స్థానాలకుగాను కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఐదు విజయం సాధించాయి. దీంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో కొంతమేర బలం పుంజుకుని బీజేపీ ఢకొీట్టేందుకు సిద్ధమైంది.