కాంగ్రెస్‌ సభ్యత్వానికి..

For Congress membership..– మెదక్‌ డీసీసీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి రాజీనామా
నవతెలంగాణ- నిజాంపేట
పదేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తాను డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని మెదక్‌ డీసీసీ అధ్యక్షులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆదివారం ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అందరినీ ఆదుకుంటున్నానని తెలిపారు. పెళ్లిం డ్లకు, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నానని, అయినా కాంగ్రెస్‌ పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసింద ని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంచులతో కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్లను అమ్ముతున్నారని వాపోయారు. ప్రజలకు సేవ చేసిన వారిని గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ కనుమరుగైనప్పటికీ పదేండ్ల నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తూ ప్రజల మన్ననలు పొందానన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం తనను గుర్తించడం లేదన్నారు. అందుకే మనోవేదనతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

Spread the love