యాచించే స్థితి నుండి శ్యాషించే స్థాయికి ఎదగాలి..

– మీర్ పేట్ ఇన్స్పెక్టర్ కె కిరణ్ కుమార్
నవతెలంగాణ – మీర్ పేట్
ట్రాంజెండర్స్ యాచించే స్థాయి నుండి సాచించే స్థాయికి ఎదగాలని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ట్రాంజెండర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాంజెండర్స్ లో చాలామంది ప్రతిభవంతులు ఉన్నారన్నారు. మంచి ఉన్నత చదువులు కూడా అభ్యసించి కొన్ని పరిసరాల ప్రభావం రిత్యా ట్రాంజెండర్స్ గా మారారని తెలిపారు. ప్రభుత్వం, ప్రజ్వల సహకారంతో వికల్ప్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ట్రాంజెండర్స్ విధిలేని పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ యాచకులుగా, వ్యభిచారం చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఉపాధి శిక్షణ ఇచ్చి ఉద్యోగం, వ్యాపారం కల్పించాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని బతకాలన్నారు. సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఎవరి విద్య అర్హతలను బట్టి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధాన ఉద్దేశం అన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా ట్రాంజెండర్స్ కు మీర్పేట్ లో వికల్ప్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ప్రారంభించమని పేర్కొన్నారు. ట్రాంజెండర్స్ ఎవరిని బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ సెంటర్ వచ్చి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా శిక్షకు అర్హులవుతారని పేర్కొన్నారు. అనంతరం ట్రాంజెండర్స్ కొందరు మాట్లాడుతూ ఏదో తెలియని పరిస్థితుల వల్ల మేము ట్రాంజెండర్స్ గా మారడంతో మావల్ల మా కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేము బయటికి వచ్చామని ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సహకరించి ఆదుకోవాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వికల్ప్ సెంటర్ కు వచ్చి వివరాలు తెలుసుకోవాలని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆలీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోవింద్ స్వామి, సుధాకర్, యేసయ్య తిరుపతిరెడ్డి, ట్రాంజెండర్స్ సోనాక్షి, ఆర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love