నేడు బుద్ధ జయంతి

నేడు బుద్ధ జయంతి– నాగార్జున సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌లో వేడుకలకు ప్రభుత్వ ఏర్పాట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా గురువారం నాగర్జున సాగర్‌లోని బుద్ధవనం, హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన నాగర్జున సాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్ద నిర్వహించే బుద్ధ జయంతి వేడుకల్లోనూ మంత్రి పాల్గొంటారు.

Spread the love