జన్యుశాస్త్రంలో మార్పులు – ఆరోగ్య రంగంల ప్రభావంపై రేపు సమావేశం..


నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ లో మంగళవారం బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో జన్యు శాస్త్రంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ మామిడాల పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరు మరియు సీసీఎంబి హైదరాబాద్ శాస్త్రవేత్తల సహకారంతో వర్క్ షాపు కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి బ్రోచర్ను సోమవారం విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు, ఇంటర్మీడియట్, తొమ్మిదో తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన తరగతులు ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ హాజరై జన్యు శాస్త్రంలో జరిగే అత్యాధునిక మార్పులను అవగాహన చేసుకోని భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.ఈ అవగాహన తరగతులలో జన్యూ శాస్త్రం మానవ జీవన ప్రమాణ స్థాయిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, మానవ మనుగడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమగ్రంగా అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన డాక్టర్ కిరణ్యి , డాక్టర్ జెవేరియా, డాక్టర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love