విషాదం.. పెళ్లైన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య..

నవతెలంగాణ- నెల్లూరు: నెల్లూరులోని చైతన్య అనే యువతి నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ వైద్య విద్యని చదువుతున్నది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. మొదట్లో అంతా సజావుగానే సాగింది కానీ.. ఇంతలోనే ఆ యువతి కాలేజీ హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఈ రోజు ఉదయం హాస్టల్‌ గదిలో సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే  హాస్టల్‌కు చేరుకొని, ఆమె మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  చైతన్య ఉన్న హాస్టల్ గదిని సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక విచారణలో భాగంగా కుటుంబ కలహాల కారణంగానే చైతన్మ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు.  సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లైన రెండు నెలలకే చైతన్య సూసైట్ చేసుకోవడంతో.. కచ్ఛితంగా బలమైన కారణం ఉండనే ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

 

Spread the love