ఇన్నోవేషన్‌ డిజైన్‌ రోబటిక్స్‌ పై ఎంఎల్‌ఆర్‌ఐటీఎంలో శిక్షణ

నవతెలంగాణ-దుండిగల్‌
కత్బుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎల్‌ఆర్‌ఐటిఎంలోని రోబోటిక్స్‌ ఆటోమేషన్‌ ల్యాబ్‌, ఇన్నొవేషన్‌ ఇన్క్యుబేషన్‌ కౌన్సిల్‌ సహకారంతో జూన్‌ 20, 21 తేదీల్లో ”ఆటోమేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌: ఇన్నొవేషన్‌ డిజైన్‌ ఇన్‌ రోబోటిక్స్‌” అనే రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఉన్నత పాఠశాల విద్యార్థులకు శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించింది. శనివారం జెడ్పిహెచ్‌ ఎస్‌-గుండ్లపోచంపల్లి పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ ప్రత్యేక అవుట్‌రిచ్‌ ప్రోగ్రామ్‌, ఆధునిక రోబోటిక్స్‌ టెక్నాలజీపై ప్రాక్టికల్‌ అనుభవం, ఇన్నొవేషన్‌ డిజైన్‌ పై ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సజనాత్మకత, ఆసక్తిని ప్రేరేపించే వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాల ను కల్పించింది. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ డా. ఆర్‌. మురళి ప్రసాద్‌, డైరెక్టర్‌ డా. పి. శ్రీధర్‌ కన్వీనర్‌ డా. జి. అమర్నాథ్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.

Spread the love