మద్నూర్ ఎస్సై బదిలీ..

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ అతి త్వరలోనే బదిలీపై వెళ్తున్నారు. ఇక్కడి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతుకుంటకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి మద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తో పాటు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శాలువాతో సత్కరించారు. శ్రీకాంత్ గౌడ్ ఇటీవల కాలంలోనే ఇక్కడికి వచ్చారు. అంతలోనే బదిలీపై వెళ్తున్నారు.
Spread the love