బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి

– ఎస్టీయూ జిల్లాధ్యక్షుడు పట్నం భూపాల్ 
నవతెలంగాణ-బెజ్జంకి
సుదీర్ఘకాలం అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలని ఎస్టీయూ జిల్లాధ్యక్షుడు పట్నం భూపాల్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాస్ రోడ్, దాచారం,వీరాపూర్,తోటపల్లి,లక్మిపూర్, బేగంపేట,వడ్లూర్, బెజ్జంకి,కల్లెపల్లి,చీలాపూర్ గ్రామాల పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా పట్నం భూపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు,సీనియారిటీ దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని,పదోన్నతులలో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడానికి సమ్మతించినందున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసినారు.పీఆర్ సీ నియామకం చేసి ఐఆర్ ప్రకటించాలని,సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. పాఠశాలలో  స్కావెంజర్స్ ను నియమించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మ్యాడ శ్రీధర్,జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్,మండలాధ్యక్షుడు రామంచ రవీందర్,జిల్లా కౌన్సిలర్ సభ్యులు నారోజు శంకరాచారి, మండల ఆర్థిక కార్యదర్శి షాబుద్దీన్,ఉపాధ్యాయురాలు సుచరిత పాల్గొన్నారు.
Spread the love