ఎన్నికల షెడ్యూల్‌లోపు బదిలీలు చేయాలి

Transfers should be done within the election schedule– సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలోపని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యేలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మధ్యలో ఆగిపోతున్నాయనీ, హై కోర్టులో కేసులు పడుతున్నాయనీ, ప్రతి కేసుపై స్టేలు కూడా సులభంగా వస్తున్నాయని తెలిపారు. కోర్టు స్టేలను తొలగించటం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్య డైరెక్టరేటుకు సాధ్యం కావటం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ తగిన శ్రద్ధ చూపటం లేదనీ, ప్రభుత్వ అడ్వకేటుకు సరైన సమాచారాన్ని ఇవ్వటంలో వైఫల్యం ఉందని తెలిపారు. పాఠశాల విద్యాడైరెక్టరేట్‌ అలా తయారు కావటానికి కేంద్రీకృత పాలనే కారణమని ఆరోపించారు. ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల గురించి పలు మార్లు ప్రకటించినా ”ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా” ఉన్నదని గుర్తు చేశారు.

Spread the love