గోజేగావ్ గ్రామంలో గిరిజన దినోత్సవం

– గురువు రామారావుకు నివాళులర్పించిన నాయకులు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా శనివారం నాడు మద్నూర్ మండలంలోని గోజే గావ్ గ్రామంలో గిరిజన దినోత్సవం పరంగా నిర్వహించారు. ఆ గ్రామంలో గ్రామ సర్పంచ్ అనిత ఇరువంత్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో గిరిజన నాయకుడు మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత సింగిల్ విండో డైరెక్టర్ శివాజీ రాథోడ్ అలాగే మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ఆ గ్రామ అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ విద్యార్థిని విద్యార్థులు గ్రామ గిరిజన ప్రజలు పాల్గొని గిరిజన గురువు రామారావు చిత్రపటానికి ప్రతి ఒక్కరూ నివాళులర్పించారు. ప్రభుత్వపరంగా దశాబ్ది ఉత్సవాల్లో గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Spread the love