జిల్లా ఆర్యవైశ్య సభ్యులకు సన్మానం

Tribute to District Arya Vaishya membersనవతెలంగాణ – భిక్కనూర్
జిల్లా ఆర్యవైశ్య సంఘంలో నూతనంగా ఎన్నికైన సభ్యులను మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురం రాజమౌళి మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. జిల్లా ఆర్యవైశ్య సంఘంలో జిల్లా కార్యదర్శిగా పట్టణానికి చెందిన పబ్బ నాగరాజు, కార్యవర్గ సభ్యుడిగా రవీందర్, డైరెక్టర్ గా వెంకటేశం నియమించడం పట్ల అభినందిస్తూ సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love