
డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని, ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన, నగరంలో గల పులాంగ్ చౌరస్తా నందు గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు సంగం అమృత్ కుమార్ , టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , టిఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్,దినేష్ బాబు, సంజీవయ్య, సతీష్ కుమార్, ఉమా కిరణ్ జేఏసీ సభ్యులు మోహన్, సంజీవరావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.