Friday, April 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌పై ట్రంప్‌ అక్కసు

భారత్‌పై ట్రంప్‌ అక్కసు

- Advertisement -

– ఇండియా, చైనాలు నరకకూపాలు
– బిడ్డలను కనడానికే వస్తారంటూ జాత్యాహంకార వ్యాఖ్యలు
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఉన్న తన అక్కసును వెళ్లగ్రక్కారు. ఆ దేశ పొలిటికల్‌ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్‌ మైఖేల్‌ సావేజ్‌ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్‌ సమర్థిస్తూ గురువారం రీపోస్ట్‌ చేశారు. భారత్‌, చైనా ఇతర దేశాలను ”నరక కూపాలు”గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావెజ్‌ కోరారు. ఈ రెండు దేశాల ప్రజలు తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు.
పోస్ట్‌లో ఏముంది?
రేడియో హోస్ట్‌ మైకేల్‌ సావేజ్‌ చేసిన పోస్టులో ”అమెరికాలో పుట్టిన బిడ్డకు వెంటనే పౌరసత్వం వస్తుంది. తర్వాత చైనా నుంచో, భారత్‌ నుంచో లేదా మరేదైనా నరకకూపం నుంచో మొత్తం కుటుంబాన్ని తెచ్చుకుంటారు” అని వ్యాఖ్యానించారు. అమెరికాలో పుట్టిన శిశవులను ”యాంకర్‌ బేబీలు”గా అభివర్ణిస్తూ, వారు తర్వాత తమ బంధువులను స్పాన్సర్‌ చేసి వలసలకు తెర తీస్తున్నారని విద్వేష వ్యాఖ్యలు చేశారు. దీన్ని ట్రంప్‌ దీన్ని షేర్‌ చేశారు.
జన్మహక్కు పౌరసత్వంపై చట్టపోరు
ట్రంప్‌ జనవరి 2025లో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ వ్యాఖ్యానాన్ని సవాలు చేశారు. అమెరికా అంతర్యుద్ధానంతరం బానిసత్వం నుండి విముక్తులైన వారి హక్కుల రక్షణ కోసం రూపొందించిన ఈ సవరణ అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి శిశువుకూ పౌరసత్వం కల్పిస్తుందని సంప్రదాయ వ్యాఖ్యానం చెప్తోంది. అయితే ట్రంప్‌ పరిపాలన దీన్ని వ్యతిరేకిస్తూ, చట్టవిరుద్ధ వలసదారులు, తాత్కాలిక వీసాదారుల పిల్లలకు ఈ హక్కు వర్తించదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఈ నెల ఈ కేసు విచారించగా, ట్రంప్‌ స్వయంగా హాజరయ్యారు. అమెరికా చరిత్రలో అలా చేసిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే.
మైఖేల్‌ సావేజ్‌ ఎవరు?
కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన మైఖేల్‌ సావేజ్‌ తరుచుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిచే వ్యక్తి. అంతేకాదు ట్రంప్‌నకు పెద్ద మద్దతుధారుడు కూడా. ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అయిన సావేజ్‌, తరుచుగా వివాదాలు సృష్టిస్తారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే ఆయన్ని యూకెే నిషేధించింది.గతంలో డెమోక్రాట్లు, అక్రమ వలసదారులు, వామపక్షలపై, ట్రాన్స్‌జెండర్‌ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒబామాను ఉద్దేంశించి ”డెమోక్రాట్‌-సోషలిస్ట్‌ మార్క్సిస్ట్‌ నుండి అమెరికా కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది,” అని అతను ”మావోబామా” అని ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర నిరసనలకు దారి తీసింది. చివరికి వివాదస్పదం కావటంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -