టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంఈఓ..

TS UTF calendar unveiled MEO..నవతెలంగాణ – పెద్దవంగర
టీఎస్ యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో గురువారం ఎంఈవో బుధారపు శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఎర్ర వెంకన్న, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రభాకర్ తో కలిసి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేసే విధానంలో టీఎస్ యూటీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love