అప్పారెడ్డిపల్లివాసి ఉడుతల జగన్‌కు డాక్టరేట్‌

– అమెరికా వాషింగ్టన్‌ డిజిటల్‌ యూనివర్సిటీ
– నుండి గౌరవ సోషల్‌ వర్క్‌ డాక్టరేట్‌జగన్‌ను శుభాకాంక్షల వెల్లువ
– కరోనా సమయంలో సామాజిక సేవకుడిగాను గుర్తింపు
– హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మాడ్గులం మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉడు తల నరసింహ, అండాలు దంపతుల కుమారుడు, ప్రయివేటు హాస్పిటల్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ ఉడుతల జగన్‌ కు డాక్టరేట్‌ వరించింది. అమెరికా వాషింగ్టన్‌ డిజిటల్‌ యూనివర్సిటీ నుండి గౌరవ సోషల్‌ వర్క్‌ డాక్టరేట్‌ హర్యానా రాష్ట్రంలో అందజేసినట్లు జగన్‌ తెలిపా రు. గత కొన్ని ఏండ్ల నుండి ప్రయివేట్‌, ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన అసోసియేషన్‌ ద్వారా అదేవిధంగా కరో నా కష్ట కాలంలో ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలకి అండగా ఉం డి ఆపదలో సేవలు అందించారు. అర్థరాత్రి సైతం లెక్క చేయకుండా చేసిన సేవలకు గుర్తింపు గాను అవార్డు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా అప్పారెడ్డిపల్లి గ్రామంతో పాటు మండలంలోని పలు వురు జగన్‌ను అభినందించారు.

Spread the love