మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

నవతెలంగాణ- బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రం నడిమి గల్లీ కాలనీకి చెందిన రజక సంఘం నుంచి 100 కుటుంబాలు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను శనివారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,స్థానిక నాయకులకు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ రజక సంఘం నుంచి 100 కుటుంబాలు కలిసి తీర్మాన పత్రాలను బిఆర్ఎస్ నాయకులకు అందజేశారని తెలిపారు.సంఘ సభ్యులు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు మరవకుండా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు బాల్కొండ గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తిమద్ధతు పలుకుతామని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్,ఉపసర్పంచ్ షేక్ వాహబ్,ఎంపీటీసీ కన్న లింగవ్వ-పోశెట్టి,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,వార్డు సభ్యులు గాండ్ల రాజేష్,రైతు విభాగం మండల అధ్యక్షుడు ధర్మాయి రాజేందర్,నాయకులు మామిడి నర్సయ్య,సంఘం అధ్యక్షుడు సల్లగరిగే పోషన్న,ప్రధాన కార్యదర్శి మీరా చంద్రశేఖర్,సంఘ పెద్దలు మీరా నర్సయ్య,గణేష్, సాయందర్,చిన్న పోషన్న,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love