సీఎం కేసీఆర్ పాలనలో అన్ని అఘాత్యాలే…

– ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అభ్యర్థి నిషాని రామంచంద్రం 

– కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బడుగుల వ్యతిరేకత పార్టీలేనని సూచన 
– 1200 ఎకరాల భూమిని పంపిణీ చేశానని ఎమ్మెల్యే రసమయి వాఖ్యలు అబద్దాలే 
– ప్రజల భవిష్యత్తు బీఎస్పీ ప్రభుత్వంతోనే సాధ్యమని హితవు 
నవతెలంగాణ-బెజ్జంకి 
యువత భవిష్యత్తు మారుతుందని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించిన సీఎం కేసీఆర్ పాలనలో అన్ని అఘాత్యాలేనని మానకొండూర్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి నిషాని రామంచంద్రం అన్నారు.సోమవారం మండల కేంద్రంలో నిషాని రామచంద్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రామచంద్రం మాట్లాడారు.ఇప్పటి వరకు పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలన్ని బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పార్టీలే అన్నారు. దోరల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతూనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని దళితులకు సుమారు 1200 ఎకరాల భూమి పంపిణీ చేశామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వాఖ్యలు అబద్ధాలేనని ఆరోపించారు.బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తు బీఎస్పీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్,మాతంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love