Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅపరిశుభ్రంగా ప్రభుత్వాస్పత్రి

అపరిశుభ్రంగా ప్రభుత్వాస్పత్రి

- Advertisement -

సంగారెడ్డి దవాఖానా సమస్యలపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలి
ఎంఆర్‌ఐ సదుపాయం కల్పించాలి
పేషెంట్లకు అన్ని రకాల టెస్టులు చేయాలి
రోగుల సహాయకులకు సదుపాయాలల్లేవు
మరుగుదొడ్లు, తాగునీరు సమస్య తీర్చాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
వర్గ సభ్యుడు చుక్క రాములు
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పుత్రిలో
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆపరిశుభ్రతకు నిలయంగా మారిందని, రాష్ట్ర ఆరో గ్యశాఖ మంత్రి ఆస్ప్రతిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆద్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే నిర్వహించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ సమస్యలతో సతమతమవుతున్న సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా మంత్రి సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నప్పటికీ సరైన వసతులు, సదుపాయాలు లేవన్నారు. ఆస్ప్రతిని సీపీఐ(ఎం) బృందం పరీశీలించగా చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులు, బంధువులకు కనీస వసతి సదుపాయంలేదన్నారు. జిల్లా కేంద్ర ఆస్ప్రతికావడంతో సంగారెడ్డి, మెదక్‌ ‌జిల్లాలకు చెందిన మహిళలు ప్రసూతీ వైద్య సేవల కోసం చాలా మంది మహిళలు వస్తున్నారని, వారి వెంట వచ్చే వారి సహాయకులకు ఏలాంటి సౌకర్యాల్లేవన్నారు. చిన్నపాటి సందులో వందల మంది మహిళలు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సేద దీరేందుకు రూంలు లేకపోవడమే కాకుండా ఇరుకు సందులో ఉన్న వారికి కనీసం ప్యాన్లు సైతం ఏర్పాటు చేయలేదనన్నారు. స్నానాలు చేసేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూంలు లేవన్నారు. ఆస్పత్రిలో తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో బయటి నుంచి కొనుక్కునే పరిస్థితి ఉందన్నారు.

ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. మాతా శిశు సంరక్షణ అని చెబుతున్నా అక్కడ ఏలాంటి సంరక్షణ కనిపించేట్లేదన్నారు. జిల్లా కేంద్ర ఆస్ప్రతి, మెడకల్‌ ‌కళాశాల ఉన్నప్పటికీ ఎందుకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగానే కాక సంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న రాజనర్సింహ చొరవతీసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా మంత్రి సంగారెడ్డి మాతా శిశు ఆస్రత్రిని సందర్శిస్తే ఇక్కడ ఉన్న సమస్యలు అర్థమవుతాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస అవసరాలైన మంచినీరు, మరుగుదొడ్లు, వాష్ రూంలు, రోగుల బందువులు రాత్రిపూట ఉండడానికి వసతి ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద ఆసుపత్రికి ఎన్నో ఎకరాల స్థలం ఉన్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ ఆశ్రద్ధను తెలియజేస్తుందన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజలు అనేక రూపాల్లో పన్నులు కుడుతూ ఆదాయం సమకూరుస్తున్నామని, కట్టే పన్నుల ఆధాయం నుంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేయకుండా అట్టి డబ్బులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు. బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయాలు వైద్య, ఆరోగ్యశాఖకు కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తున్నారని, మరి ఆ బడ్జెట్ ప్రభుత్వ ఆస్ప్రతుల అభివృద్ధి కోసం కాకుండా ఎక్కడ ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ప్రసూతి, ఇతర వైద్య సేవల కోసం వచ్చే పేషెంట్లకు స్కానింగ్, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక సేవల్ని ఆటంకంలేకుండా అందించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌జోక్యం చేసుకుని ఆస్ప్రతిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, పి.కృష్ణ, సంగారెడ్డి మండల కమిటీ సభ్యులు బి.శ్రీనివాస్, ఎం.బాలరాజ్‌, నాయకులు శంకర్, యూసు‌ఫ అలీ, మురళీ, రాజు, యాదగిరి, మల్లేశం, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -