ఆకాల వర్షం..రైతన్నకు అపార నష్టం..

– కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం
నవతెలంగాణ – బెజ్జంకి  
ఆరుగాలం కష్టపడిన రైతులు ఆకాలంగా కురిసిన వర్షం వల్ల ఆగమాగమయ్యాడు.కోతకు వచ్చిన వరిపంటలను కోసి వరిధాన్యాన్ని విక్రయించడానికి గత కొద్ది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించారు.మంగళవారం మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర అందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల నిర్వహాకులు నిర్లక్యంగా వ్యవహరించడం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు.ఆకాల వర్షం వల్ల తడిసిన వరిధాన్యాన్ని ఎలాంటి అంక్షలు లేకుండా కేంద్రం నిర్వహాకులు మద్ధతు ధరపై  కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరితగతిన కొనుగోల్లు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
Spread the love