ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన

Upadhyaya MLC election awarenessనవతెలంగాణ – గోవిందరావుపేట
వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల కోసం అర్హత గల ఉపాధ్యాయులు అధ్యాపకుల నమోదు ప్రక్రియ పై స్థానిక తహసిల్దార్ ఎన్ సృజన్ కుమార్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి గొంది దివాకర్ తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ నమోదు వేగవంతం చేయాలని 100% అందరు నమోదు చేసుకునే విధంగా సంఘాలు ప్రయత్నం చేయాలని కోరారు. 2018 నవంబర్ 1 నుంచి, 2024 నవంబర్ 1 వరకు మూడేళ్ల పాటు ప్రభుత్వ విద్యా రంగ సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఓటర్ నమోదు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సతీష్, ఆర్  ఐ రాజేందర్ లతోపాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Spread the love