ప్రతిపక్షాల అసత్య ప్రచారం తగదు : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రెండో పంట కాలంలోనూ యూరియా యాప్‌నకు విశేష ఆదరణ లభిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దానిపై రైతుల్లో అసత్య ప్రచారం చేయొద్దని, అపోహలు సృష్టించొద్దని ఆయన ప్రతిపక్షా లకు హితవు పలికారు. ఫెర్టిలైజర్ యాప్‌ను దేశం మొత్తం ఆరంభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ఇప్పటికే పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన జిల్లాలలో అమలు చేస్తోందని తెలిపారు. ప్రస్తుత వానా కాలంలో ఇప్పటివరకు 11.71 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 38.62 లక్షల సంచులను బుక్‌చేసుకోగా ఇప్పటికే 34 లక్షల సంచులు రైతులకు పంపిణీ చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తం గా మరో 85.84 లక్షల యూరియా సంచుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలి పారు. ఖరీఫ్ లో ఇప్పటివరకూ 14.78 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని తెలి పారు.
యూరియా వినియోగం జూన్ మూడో వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు సృష్టిస్తున్న భయాందోళనతో రైతులు ఇప్పటికే 34 లక్షల బస్తాలు కొను గోలు చేసి ముందస్తు నిల్వ చేసుకొన్నారని పేర్కొన్నారు. కౌలు రైతుల కోసం ఓటీపీ విధానం, నిరక్షరాస్యులు గా ఉన్న రైతుల కోసం ఫోన్ బుకింగ్, వాలంటీర్ల సేవలు, మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు వంటి ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. కొన్ని ప్రాంతా ల్లో మొక్కజొన్నకు ఎకరానికి 8 నుంచి 10 యూరియా సంచులు వినియోగి స్తున్న పరిస్థితులున్నాయని వివరించారు. అధిక యూరియా వినియోగం వల్ల భూ సారం దెబ్బతింటుందని హెచ్చరించారు. దాదాపు 12 వేల ఎరువుల రిటైల్ విక్రయ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ సజా వుగా సాగుతోందని తెలిపారు. కొన్ని చోట్ల చిన్న చిన్న సాంకేతిక సమస్యలను చూపెట్టి వ్యవస్థనే విఫలమైందని ప్రచారం చేయటం సరికాదని మంత్రి పేర్కొన్నారు. గతంలో సబ్సిడీ యూరియా అక్రమ మళ్లింపులు, బ్లాక్ మార్కెట్, అధిక వినియోగం వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఒక్కరోజు కూడా ధర్నా చేయని వారు, ఇప్పుడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
యూరియా యాప్‌నకు విశేష ఆదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



