నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హజ్ యాత్రకు వెళ్తున్న వారికి మంత్రి హరీశ్ రావు వ్యాక్సిన్లు అందజేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లి హజ్ వ్యాక్సినేషన్ క్యాంపు కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యాత్రికులు రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రార్థించాలని కోరారు. మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందనీ, వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మెన్ మహమ్మద్ సలీం, మైనార్టీస్ కమిషన్ చైర్మెన్ తారిక్ అన్సారి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు.