వడపర్తి కత్వలోకి కాలేశ్వరం నీళ్లు వచ్చే విధంగా చూడాలని వినతి

నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి. బొమ్మలరామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామ సమీపంలో గల చెరువు కాలేశ్వరం నీటితో అలుగు పోస్తుందని ఆ అలుగు నీటిని వడపర్తి కత్వలోకి వచ్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ మన్నెవారుపంపు, తాజ్ పుర్  గ్రామ రైతులు మంగళవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని యాదగిరిగుట్ట  లోని ఆయన నివాసంలో  భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్, మన్నెవారిపంపు మాజీ సర్పంచ్ బోయిని పాండు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చౌదరిపళ్లి చెరువు అలుగు నుంచి బయటికి వస్తున్న నీరు వృధా కాకుండా కాలువ ద్వారా వడపర్తి కత్వలో పడేవిధంగా చూస్తే వడపర్తి, మన్నెవారిపంపు, మేడిపల్లి,  తాజ్పుర్ గ్రామాల సమీపంలోని  రైతుల పొలాలకు నీరందుతుందన్నారు. వడపర్తి, మన్నెవారిపంపు,  తాజ్ పుర్ గ్రామాల పరిధిలోని రైతుల పొలాలు ఇప్పటికే నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోయాయని కత్వలోకి నీరు వచ్చే విధంగా చేస్తే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులలో నీటి శాతం పెరుగుతుందని దీంతో పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయనీ అన్నారు.
Spread the love