క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు

Valmiki Jayanti Celebrations at Kshatriya Schoolనవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని చేపూర్  క్షత్రియ పాఠశాలలో ఆదికవి వాల్మీకి జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించినారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాల్మీకి చిత్ర పటమునకు పూలమాల వేసి పూజ కార్యక్రమమును నిర్వహించినారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసంహస్వామి మాట్లాడుతూ.. కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు… మహా పురుషులౌతారు… అన్న దానికి వాల్మీకి మహర్షి  చక్కని ఉదాహరణ అని, బోయవాడైన వాల్మీకి సంసృతంలో 24 వేల శ్లోకాలతో కూడిన రామాయణం రచించిన ఒక గొప్ప మహర్షి అని అన్నారు. సంపూర్ణ మానవాళికి రామాయణం ను అందించిన గొప్పవ్యక్తి వాల్మీకి అని కొనియాడారు. విద్యార్థులందరు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందడుగు వేయాలని అన్నారు. ఈనెల  25 న హర్యానా లోని రోతక్ లో నిర్వహించబడిన 43వ సబ్ జునియర్ బాల్ బాడ్మింటన్ జాతీయస్థాయి టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న  క్షత్రియ పాఠశాల విద్యార్థి బోనగిరి శ్రీ హర్ష తృతీయ స్థానం సంపాదించి తన ప్రతిభను చాటినట్టు తెలిపారు..ఈ కార్యక్రమంలో విద్యార్థికి క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ అల్జపూర్ శ్రీనివాస్  ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మి నరసింహస్వామి అభినందనలు తెలిపారు.
Spread the love