వీసీ ఎసిబి కి చిక్కడం తో యూనివర్సిటీ లో టపాసులు కాల్చి సంబరాలు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ దాచేపల్లి రవీందర్ హైదరాబాద్ లోని కిమ్టీ కాలనీ, స్ట్రీట్ నెం.1 తార్నాక లోని తన నివాసంలో దాసరి శంకర్, అధ్యక్షుడు, శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్మూర్ టౌన్ నుండి రూ.50, రూపాయలను లంచం డిమాండ్ చేసి స్వీకరించిన తర్వాత ఎసిబి అధికారుల వలలో పడటంతో యూనివర్సిటీలో టపాసుల కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన నటి నుండి నేటి వరకు అన్ని వివాదస్పద నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్టను మంటగలిపారని వారన్నారు. గత రేండు నేలలుగా యూనివర్సిటీలో రోజుకో ఆందోళన కోనసాగిన వైస్ ఛాన్సలర్ మొండి పట్టు పట్టారని, ఎట్టకేలకు తెలంగాణ యూనివర్సిటీకి మొక్షం కలిగిందని వారన్నారు.

 

Spread the love