– ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం…
– కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండలంలోని చల్మెడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తన సొంత డబ్బులతో విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచీలతో పాటు అంగన్వాడి చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులు అందజేశారు.పాఠశాల ఆవరణాన్ని పచ్చనిగా మార్చేందుకు ఆహ్లాదకరమైన పూల మొక్కలను తెచ్చి నాటారు . పాఠశాలంతా పచ్చని మైదానం ల మొక్కల్ని పెంచాలని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు తమ చిన్నారులను పంపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.తన గ్రామ అభివృద్ధికి మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింధూష, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగస్వామి, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాతరాజు సత్తయ్య కొంక శంకర్ చంద్రయ్య, పగిళ్ల శ్రీరాములు, గాదపాక యాదయ్య, సిపిఐ నాయకులు బొమ్మరగొని లాలు, బండమీది యాదయ్య తదితరులు ఉన్నారు.