కుల నిర్ములకు అందరు కృషి చేయాలి : వైస్ ఎంపీపీ పులి కోట రమేష్ 

నవతెలంగాణ-శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో గద్దపాక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైస్ ఎంపీపీ పులికోట రమేష్ మాట్లాడుతూ, గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి నెల 31 న పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు.గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.విద్య అనేది ప్రతి పౌరునికి అతి ముఖ్యమైనదని ఈ విద్య విధానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఎంపీడీవో ఎండి బసీరుద్దీన్ మాట్లాడుతూ, దళిత నాయకులు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సమస్యలు అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఆర్ ఐ లక్ష్మారెడ్డి, కల్వల సర్పంచ్ దాసరపు భద్రయ్య, ఏఎస్ఐ మల్లారెడ్డి, గ్రామపంచాయతీసెక్రెటరీ దాసరపు సుమన్,కో ఆప్షన్ నెంబర్ పులికోట మహేందర్ ,మొండయ్య, మండలంలోని అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Spread the love