– కనీస వేతనం 56 శాతం పెంపు
ఢాకా: కనీస వేతన పెంపు కోసం బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికులు వారం రోజులుగా చేస్తున్న సమ్మె విజయవంతమైంది. కనీస వేతనం 56 శాతం పెంచుతున్నట్లు కార్మిక మంత్రి మొన్నుజన్ సుఫియాన్ ప్రకటించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికుల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. కొత్త పే స్కేల్ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రపంచంలో చైనా తర్వాత బంగ్లాదేశ్ రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తిదారు. చివరిగా 2018లో వేతన సవరణ జరిగింది. కనీస వేతనం 75 డాలర్ల (రూ.6,242) నుంచి 208 డాలర్లకు (రూ.17,313) పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. అయితే 25 శాతం నుంచి 90 డాలర్లు మాత్రమే పెంచుతామని ఫ్యాక్టరీ యాజమాన్యం మొండిగా చెప్పడంతో సమ్మె మొదలైంది. భారీ ర్యాలీలు, బహిష్కరణలు, ఫ్యాక్టరీ దిగ్బంధనాలు జరిగాయి. నిరసనల ఫలితంగా పలుచోట్ల పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది.
కార్మికులు తమ డిమాండ్‌పై పట్టుబట్టడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. 113 డాలర్లకు (9,406 రూపాయలు) పెంచేందుకు అంగీకారం కుదిరింది. దేశంలో 3500 వస్త్రాల తయారీ కర్మాగారాలు ఉన్నాయి. ఈ రంగంలో 40 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 55 బిలియన్ డాలర్ల (రూ. 4.68 లక్షల కోట్లు) వార్షిక ఎగుమతుల్లో గార్మెంట్స్ రంగం వాటా 85 శాతం దాకా ఉంది. నీ నిర్మాత బండ్ల గణేష్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. షాద్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు ఈనెల 30 కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందన్నారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.