దళిత, ఆదివాసీ అంగన్‌ వాడి ఉద్యోగులపైదౌర్జన్యం తగదు

– పోలీసులపై చర్యలు తీసుకోవాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసి దళిత మహిళ అంగన్వాడి ఉద్యోగుల పైన పోలీసులు దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించి, కొట్టి గాయపరిచిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ ఆదివాసి, దళిత మహిళలపై దాడి చేసిన ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ తదితరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులే దాడి చేసి పైగా పోలీసులను అంగన్‌వాడి ఉద్యోగులే కొట్టినట్టుగా అక్రమ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తక్షణమే దాడులు ఆపాలనీ, కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వారు చేస్తున్న పోరాటానికి కేవీపీఎస్‌ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Spread the love