వైరా మండల స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ప్రారంభం

నవతెలంగాణ-వైరా
వైరా మండల స్థాయి స్కూల్‌ గేమ్స్‌ను బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రారంభమైనవి. క్రీడలను మండల విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ రత్నమాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మరియు మానసిక వికాసం కలిగిస్తాయని అన్నారు క్రీడా స్పూర్తి కలిగి క్రీడలు విజయవంతం కావడంలో అందరూ సహకరించాలని కోరారు. ఈ రోజు బాలికల విభాగంలో విజేతగా వాలీబాల్‌ సీనియర్‌ బాలికల ప్రథమ బహుమతి యుంజెపి రెబ్బవరం, ద్వితీయ బహుమతి టి యస్‌ డబ్లుయు వైరా గెలుసు కున్నవి. కార్యక్రమానికి వైరా కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మాధవరావు, రంగారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు అరుణ శ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, ఆదర్శు, విజరు, చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్లు, రంజాన్‌, సత్యనారాయణ, రవి కుమార్‌, హేమ మాలిని, తులసి, దుర్గ,అనూష, రాజేశ్వరి, స్వరూప పాల్గొన్నారు.

Spread the love