అధిష్టానం చొరవ తో సద్దుమణిగిన వీరాపూర్ నాయకులు వివాదం

నవతెలంగాణ -తాడ్వాయి
వీరాపూర్ బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం, బీఆర్ఎస్ అధిష్టానం చొరవ తో సద్దుమణిగింది. నాలుగు మండలాల ఎన్నికల ఇన్చార్జి, టి ఎస్ ఆర్ డి సి చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు (బాబు), సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి రామస్వామి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రదీప్ రావు లు  అక్కడికి చేరుకొని వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నో రోజుల నుండి మా సమస్యలను జడ్పీ చైర్మన్ నాగజ్యోతికి తెలిపిన పట్టించుకోవడంలేదని, మా గ్రామాన్నే పట్టించుకోవడంలేదని నాయకులకు విన్నవించారు. వెంటనే స్పందించి మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సంతోషపడ్డారు. ఈ సందర్భంగా వీరాపూర్ గ్రామస్తులు నాయకులు పెనుక విశ్వనాథం, ఊషం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు మాట్లాడుతూ మేము ఏ పార్టీకి పోయేది లేదని, అధిక మెజార్టీతో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఇకనుండి మా గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని, గ్రామానికి మా సమస్యపై వచ్చి సమస్య పరిష్కరించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Spread the love