బోధన్ నియోజకవర్గం ఇండిపెండెంట్ క్రికెట్ బ్యాట్ కు ఓటేసి గెలిపించండి..

నవతెలంగాణ- రెంజల్: బోధన్ నియోజ వర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆకుల పళ్లి సుదర్శన్ రాజ్ క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక సంఖ్యలో గెలిపించాలని ఆయన కోరారు. ఈనెల 30న జరిగే ఎన్నికలలో తనను గెలిపించినట్లయితే, తాగునీరు, విద్యుత్తు, నిత్యవసర వస్తువుల అందుబాటులో ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాలుగా కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్న తెలపండి ప్రజలకు అనేక సేవలను అందించానని, నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలన్న దృక్పథంతో ఈ ఎన్నికలలో నిలబడ్డానని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, పెంచనర్ల సమస్యలపై స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Spread the love