నవతెలంగాణ- ఆర్మూర్: ఓటు ఒక వజ్రాయుధం అని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. పట్టణంలో బుధవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రచార వాహనాన్ని జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు తో పాటు బాధ్యత అని, ఇలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న రోటరీ సభ్యులను అభినందిస్తున్నాను అని నవంబర్ 30 న ఓటు హక్కు వినియోగంచుకావాలని అన్నారు. రోటరీ అధ్యక్షుడు గోపీ కృష్ణ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మన దేశ భవితను మార్చుకోవచ్చు. అది మనందరి భాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలోసెక్రటరీ తులసి, కోశాధికారి లక్ష్మి నారాయణ, కాంతి గంగారెడ్డి, పుష్పకర్ రావు, దాము, శ్రీధర్, శశి, రాము, రాజు, తదితరులు పాల్గొన్నారు.