ఓటర్ స్లిప్స్ ప్రతి ఇంటికి అందాలి: కలెక్టర్

– రోజువారీ నివేదికలు అందించాలి.
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో బి.ఎల్.ఓలు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్స్ అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. గురువారం క్యాంప్ కార్యాలయం నుండి వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో పనిచేయుచున్న బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ) ఈ నెల 25 నుండి 28 వరకు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుచున్నందున ఓటర్ స్లిప్స్ పంపిణీ వేగవంతం చేయాలని అలాగే మండల తహశీల్దార్లు, సెక్టార్ అధికారులు పర్యవేక్షణ చేసి రోజువారీ నివేదికలు అందించాలని సూచించారు.ఈ వెబెక్స్  కార్యక్రమంలో  ఆర్.డి.ఓ సూర్యాపేట వేణు మాధవ్,  కోదాడ సూర్యనారాయణ, హుజూర్ నగర్ శ్రీనివాస్ రావు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love