
నవతెలంగాణ – నెల్లికుదురు
ఈనెల 13వ తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ లను భారీ మెజార్టీతో గెలిపించి ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరినట్లు తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాదద్రి అన్నాడు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అని అన్నారు. అలాంటి గొప్ప మహా దేవత అయినటువంటి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ను గెలిపించుకుంటే మహిళ కోట నుండి మంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నారు. మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీ మెజార్టీత గెలిపించుకుంటే సోనియాగాంధీ తప్పకుండా వీరికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తుందని అన్నారు. అందుకోసం దీనిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపై, మన ఎమ్మెల్యేలపై ఉందని అన్నారు బలరాం నాయక్ మంత్రి అయిన తర్వాత బయ్యారం ఉక్కు సమస్య పూర్తిగా పరిష్కరణమై దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిపించుకుంటే ఒక చరిత్ర తిరగ రాసినట్లే అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. మీరు గెలిస్తే అక్కడ రాహుల్ గాంధీకి ఓటు వేసినట్లు గాని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో పెద్దపీట వేస్తారని తెలిపారు. కావున ప్రజలు గమనించి ఓటు నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. గెలిచే అభ్యర్థికి ఓటు వేస్తే మనకు గుర్తింపు ఉంటుందని మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆటే కావున తప్పకుండా వీరు భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జల్ల యాకయ్య కాంగ్రెస్ పార్టీ మండల మాజీ జనరల్ సెక్రెటరీ దండంపల్లి సైదులు మంద రవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.