
నవతెలంగాణ- డిచ్ పల్లి: గత పదేళ్లుగా రాష్ట్రం లో అమలౌతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడంలేదని, అన్నింటిలో మనమే టాప్ గా ఉన్నామని బీఆర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువేరి దాస్ అన్నారు. శనివారం ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి, లోలం గ్రామలలో గడపగడప కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిలువెరి దాస్ మాట్లాడుతూ ప్రతి గడపగడపకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన, చేపట్టనున్న పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీ తో బాజిరెడ్డి గోవర్ధన్ ను గేలిపించలని సూచించారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటు, పెళ్ళైన ఆడపిల్లలకు మేన మామ కట్నం లో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేస్తున్నమని వివరించారు. వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వికలాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్ అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రేండు సార్లు భారీ మెజార్టీ తో విజయం సాధించారని, ముడవ సారి మంచి మెజారిటీ తో గేలిపించుకుంటే మంత్రి పదవి ఖాయమని చిలువెరి దాస్ ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకోనే బాధ్యత ఉందన్నారు. పెద, నీరుపేదలకు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర ప్రభుత్వం కోండంత అండగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, తాళ్ల రాజు, డాక్టర్ సామల రాజేష్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గడ్కోల్ శ్రీనివాస్, మహిళా మండల అధ్యక్షురాలు పులి వసంత, ఎంపిటిసి బాబు రావు, నాగెల్లి గంగాధర్, దొండి గణేష్, కాటిపల్లి శ్యామ్, కిషన్, వడ్ల కిషన్, పందేన కుంట నవీన్, మూలుగు సాయిలు, నవీన్ తో పాటు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.