కూతురు చేతిలో మోసపోయాం

– వృద్ధ దంపతుల ఆవేదన
నవతెలంగాణ – తుర్కపల్లి
పేగు తెంచుకున్న కన్న కూతురే మమ్మల్ని మోసం చేసిందని వృద్ధ దంపతులు పత్తి మల్లయ్య, శివమలు పేర్కొన్నారు. మంగళవారం వారు తుర్కపల్లిలో విలేకరులతో తమ బాధను వ్యక్తపరిచారు ప్రస్తుతం తుర్కపల్లి మండలం వాసాల వారిలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుందని తెలిపారు.రెండు సంవత్సరాల క్రితం మేము మా కూతురితో కలిసి తిరుపతికి వెళుతున్న సమయంలో మా దగ్గర దాచుకున్న 30 తులాల బంగారాన్ని ఆమె లాఖరులో దాచిపెట్టి తిరుపతికి వెళ్లి వచ్చామన్నారు వచ్చిన తర్వాత తమ బంగారం ఇవ్వమని అడుగుతే ఇవ్వకుండా కన్న తల్లిదండ్రులను కనికరం లేకుండా నానా ఇబ్బందుల గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జూన్ 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వారు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైల్వేలో చిన్నపాటి ఉద్యోగం చేసి విరమణ చేశామన్నారు ప్రస్తుతం పెన్షన్ తోటే బతుకుతున్నామని తెలిపారు ఈ విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో తెలిపిన ఆమె ఇవ్వడం లేదన్నారు. కోర్టు తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Spread the love