– అన్‌రావెల్ డేటా వెల్లడి
హైదరాబాద్: ఆధునిక డేటా టీమ్‌ల అవసరాలను తీర్చడానికి నిర్మించిన మొదటి డేటా అబ్జర్బిలిటీ ప్లాట్‌ఫారమ్ కంపెనీ విస్తరణ మరియు అభివద్ధిని కొనసాగిస్తున్నందున వచ్చే ఏడాదిలో దాని హైదరాబాద్ హెడ్ కౌంట్‌ని రెట్టింపు చేయాలని యోచిస్తోన్నట్లు యుఎస్ ఆధారిత అన్‌రావెల్ డేటా వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు స్థానిక కార్యకలాపాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. స్థానిక టెక్ కమ్యూ నిటీకి సేవలందించేందుకు నిబద్ధతగా అన్‌రావెల్ శుక్రవారం హైదరా బాద్‌లో తన ఫ్లాగ్‌షిప్ డేటాఆప్స్ అబ్జర్బిబిలిటీ కాన్ఫరెన్స్ రెండవ భారతీయ ఎడిషన్‌ను నిర్వహించింది. డేటా-లీడింగ్ కంపెనీల నుండి 200 మంది సీనియర్ డేటా, టెక్నాలజీ నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా అన్‌రావెల్ కో-ఫౌండర్, సిటిఒ శివనాథ్ బాబు మాట్లాడుతూ.. ”ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్‌లు చాలా మంది తమ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌లో ఉన్న తమ డేటా టీమ్‌లపై ఆధార పడుతున్నారు. కాబట్టి ఇక్కడి మా బందాన్ని, కార్యకలాపాలను పెంచుకోవ డమే కాక ప్రపంచ స్థాయి లెర్నింగ్, నెట్‌వర్కింగ్ అవకాశాల ద్వారా స్థానిక టెక్ కమ్యూనిటీకి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము.” అని అన్నారు.