Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు మరింత ఉధృతంగా జరిగేలా చూస్తాం

ధాన్యం కొనుగోలు మరింత ఉధృతంగా జరిగేలా చూస్తాం

- Advertisement -

ఆలేరు మార్కెట్లో  కుప్పలు తేప్పలుగా ధాన్యం రాశులు  
స్పందించిన అధికారులు
నవతెలంగాణ దినపత్రిక ఎఫెక్ట్ 
నవతెలంగాణ-ఆలేరు టౌను  

ఆలేరు వ్యవసాయ మార్కెట్లో కుప్పలు తిప్పలుగా ధాన్యం రాశులని నవ తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. ధాన్యం దిగుబడి పెరగగ, ధాన్యం అమ్మకానికి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కు ఆలేరు పట్టణం మరియు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు , గుండాల మండలం నుండి రైతులు ఆలేర్ మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకువస్తున్నారని, అమ్మకానికి రైతులు క్యూ కాడుతున్నారని, మార్కెట్లో కల్లాలు పూర్తిగా నిండిపోవడంతో,  ధాన్యం కుప్పలు కార్యాలయం పరిసర ప్రాంత చెట్ల కింద సైతం పోసుకుంటూ రైతులు కాంటా పెట్టించడం  కోసం వేచి ఉంటున్నారని నవతెలంగాణ దినపత్రికలో సోమవారం వచ్చిన వార్తకు ఉన్నతాధికారులు ఆలేరు తహసిల్దార్ వి ఆంజనేయులు మంగళవారం స్పందించారు.

 మండల వ్యవసాయ అధికారిగా ఎస్ శ్రీనివాస్ తో కలిసి ఆలయ మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ యేలుగల కుమారస్వామి తో తాసిల్దారు వి ఆంజనేయులు గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. రోజువారీగా రైతులు తెచ్చిన ధాన్యానికి , టోకెన్లు  ఇచ్చిన విధంగా వరుస క్రమంలో ధాన్యం కాంటావేసి, నాలుగు లారీల వరకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.

సోమవారం సాయంత్రం వరకు 41 వేయి 373 బస్తాలు కంటా వేయించి లారీల ద్వారా మిల్లుకు తరలించామని చెప్పారు. సుమారు 16,459 క్వింటాళ్ల పంపమన్నారు. మంగళవారం మరో మూడు లారీల ద్వారా ధాన్యాన్ని పంపామన్నారు. మే నెల చివరి తేదీ వరకు మూడు నుండి నాలుగు లారీలు ఏర్పాటు చేసి తూకం వేసిన ధాన్యాన్ని పంపిస్తామన్నారు. చెడగొట్టు రాళ్ల వానలు వస్తాయని రైతులు దిగులు చెందవద్దన్నారు.

వ్యవసాయ మార్కెట్, పిఏసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మహిళా సంఘాలు ఐకెపి, ప్యాక్స్ రైతు సంఘాల నుండి ధాన్యం కొనుగోలు సందర్భంగా యంత్ర  పరికరాలు, బార్ దాన, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు  ప్రైవేట్ వ్యక్తులకు దాన్యం అమ్మవద్దని, ప్రభుత్వం కేటాయించిన సెంటర్లలోనే ధాన్యమమ్మీ ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మార్కెట్కు వచ్చే రైతులకు కనీస మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 

ఎండాకాలంలో చెడగొట్టు  వర్షాలు పడి ధాన్యం తడిసే అవకాశం లేదన్నారు. గత ఏడాది అకాల వర్షాలకు రైతులు పండించిన పంట మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడున్న రైతు  చిలువేరు నరసింహారెడ్డి తో మాట్లాడారు. ఇతర రైతులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ సెక్రెటరీ పద్మజ, రెవిన్యూ ఇన్స్పెక్టర్  పూర్ణచందర్రావు, సూపర్వైజర్ శ్రీనివాసు, మార్కెట్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -