Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసూపర్ ‘ఎల్‌‌నినో’ను ఎదుర్కొంటాం

సూపర్ ‘ఎల్‌‌నినో’ను ఎదుర్కొంటాం

- Advertisement -

ముందస్తు కార్యాచరణతో సిద్ధం
మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

వాతావరణ మార్పుల నేపథ్యంలో సూపర్ ఎల్ నినోను ఎదుర్కొవడానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంతోపాటు తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో “సింపోజియం” సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు అంశంపై సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని చెప్పారు. సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని తెలిపారు. కాగా ప్రస్తుత సీజన్‌‌లో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, సహజ కాలువలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -