టెహల్రాన్ వద్ద అణ్వాయుధం ఉంటే
పెను విపత్తే : ట్రంప్
పారిస్ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత తమకేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగిస్తూ ఇరాన్‌లో తాము పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సముపార్జించుకోకుండా చూడడమే ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశమని అంటూ ఒకవేళ అదే జరిగితే ఆ దేశానికి పెను విపత్తు తప్పదని హెచ్చరించారు. ఇరాన్‌తో ఒప్పందం రెండో దశకు చేరుకుంటోందని ఆయన అన్నారు. ‘ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది. అది విజయవంతం అవ్వాలి. అప్పుడు రెండో దశకు వెళుతుంది. అది తేలికగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను’ అని జీ-7 సదస్సు సందర్భంగా విలేకరులతో అన్నారు. కాగా ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమం స్విట్జర్లాండ్‌లో జరుగుతుందని, దీనికి తమ దేశం తరఫున చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ హాజరవుతారని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజీద్ తక్త్-రవంచి అంతకుముందు తెలిపారు. ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోనే సంతకాలు జరుగుతాయని, అయితే ఏ ప్రదేశంలో జరిగేదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సంతకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే తదుపరి విడత చర్చలు మొదలవుతాయని అన్నారు. అమెరికా తరఫున చర్చలలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గంటారని తెలిపారు. యుద్ధం ముగియడం అంటే లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఆక్రమణ కూడా ముగిసినట్లేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. తుది ఒప్పందం కోసం అమెరికాతో ఈ నెల 19న చర్చలు ప్రారంభం కావచ్చునని ఆయన తెలిపారు. ఆ చర్చలలో ఇరాన్ అణు కార్యక్రమం ప్రస్తావనకు వస్తుందని అన్నారు.
ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



